Namaste NRI

ఆ సమావేశంలో పాల్గొనకుండా.. రష్యా అధ్యక్షుడిని నిషేధించాలి

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను జీ`20 సమావేశాలకు అనుమతించకూడదని యూకే ప్రధాన మంత్రి రేసులో ఉన్న రిషి సునాక్‌ డిమాండ్‌ చేశాడు. ఉక్రెయిన్‌పై పుతిన్‌ అక్రమంగా చేస్తున్న యుద్దాన్ని ఆపే వరకు అతనిపై ఈ నిషేధం కొనసాగించాలని ఆయన కోరారు. పసివాళ్లు నిద్రలో మంచం మీదనే చనిపోవడానికి కారకుడైన అలాంటి వ్యక్తితో కలిసి టేబుల్‌పై కూర్చోవడం మంచిది కాదని అన్నారు. బాలీ వేదికగా ఈ ఏడాది నవంబర్‌లో జీ 20 సమావేశం జరగనుంది.

Social Share Spread Message

Latest News