Namaste NRI

20 ఏళ్ల తర్వాత సరైన నిర్ణయం… అది మా బాధ్యత కాదు

అఫ్ఘాన్‌ నుంచి తమ సైన్యాన్ని వెనక్కి రప్పించడం  సరిjైునదేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సమర్ధించుకున్నారు. ఈ నేపథ్యంలో జో బైడెన్‌ మాట్లాడుతూ అప్ఘాన్‌కు అన్ని విధాల మద్దతిచ్చినా ఉపయోగించుకోలేదని దుయ్యబట్టారు. 20 ఏళ్లుగా అఫ్ఘాన్‌ ఆర్మీకి తమ బలగాలు అన్ని విభాగాల్లో తగిన విధంగా తర్ఫీదు ఇచ్చి రాటుదేల్చాయని, అయినా తాలిబన్లతో పోరాటంలో చతికిలా పడ్డారంటూ తెలిపారు. ఏమాత్రం పోరాటపటిమను ప్రదర్శించకుండా తాలిబన్లకు అలవోకగా తలొగ్గారని మండిపడ్డారు. అఫ్ఘాన్‌ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణకు కట్టుబడి ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. 20 ఏళ్ల తర్వాత సరైన నిరయం తీసుకున్నామని అన్నారు. ఈ నిర్ణయంపై తాము చింతించడం లేదని అన్నారు.

                తీవ్రవాదానికి తాము ఎప్పడూ వ్యతిరేకమని చెప్పిన, అమెరికా సైన్యానికే ఎక్కువ నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అఫ్ఘాన్‌లో జాతి నిర్మాణం అగ్రరాజ్యం బాధ్యత కాదని, యూఎస్‌పై ఉగ్రవాదులను నిరోధించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో అమెరికాకు ఏది మంచిదో దానిపైనే దృష్టి పెడతామన్నారు.  ఈ సంక్షోభానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వైఖరి కూడా ఓ కారణమని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events