కాబుల్ ఎయిర్‌పోర్టు వద్ద పేలుళ్లకు కుట్ర పన్నిన ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి అమెరికా డ్రోన్ దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ దాడిని తాలిబన్లు ఖండిరచారు. అమెరికా జరిపిన డ్రోన్ల దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయారని తాలిబన్ అధికార ప్రతినిధి జబిబుల్లా ముజాహిద్ తెలిపారు. ఈ దాడులు చేపట్టే ముందు అమెరికా సమాచారం ఇవ్వలేదని, దీన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. విదేశీ గడ్డపై అమెరికా చర్యలు చట్ట విరుద్ధమైనవని అన్నారు. అఫ్ఘనిస్తాన్‌లో ఏదైనా ముప్పు పొంచి ఉన్నట్లయితే మాకు చెప్పాలి. ఏకపక్ష వైఖరితో వ్యవహరించకూడదు. దీని కారణంగా అనేక మంది పౌరులు చనిపోయారు అని మజూహిద్ అన్నారు.