Namaste NRI

తానా కన్వెన్షన్‌ వేదిక పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌ను పరిశీలించిన తానా టీమ్‌

వచ్చే సంవత్సరం (2023) జూలై నెలలో నిర్వహించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహాసభలకు వేదికగా పెన్సిల్వేనియాలోని కన్వెన్షన్‌ సెంటర్‌ను వేదికగా నిర్ణయించారు. తానా నాయకులు ఈ మహాసభలు జరిగే కన్వెన్షన్‌ సెంటర్‌ను సందర్శించారు. సెంటర్‌లో ఉన్న సదుపయాలు, సౌకర్యాలను తెలుసుకున్నారు. తానా మహాసభల కన్వీనర్‌ పొల్లూరి  రవి ఈ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఉన్న ఏర్పాట్లను తానా నాయకుల బృందానికి వివరించారు. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి, మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్‌, తానా ప్రతినిధులు లక్ష్మీ దేవినేని, శ్రీ అట్లూరి, శ్రీని లావు, శ్రీనివాస్‌ ఓరుగంటి, వంశీ వాసిరెడ్డి, జాని నిమ్మలపూడి, సునీల్‌ కోగంటి, హరీష్‌ కోయ, రాజా కసుకుర్తి, విద్య గారపాటి, రవి మందలపు, శ్రీ చౌదరి, శ్రీని లావు తదితరులు వేదికను పరిశీలించారు.

Social Share Spread Message

Latest News