Skip to main content

Namaste NRI

బొమ్మ బ్లాక్‌బస్టర్‌  బిగ్‌ హిట్‌ అవ్వాలి

నందు విజయ్‌కృష్ణ, రష్మి గౌతమ్‌ జంటగా రాజ్‌ విరాట్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బొమ్మ బ్లాక్‌బస్టర్‌. ప్రవీణ్‌ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్‌ రెడ్డి మద్ది, మనోహర్‌ రెడ్డి యెడ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకి హీరో  నాగశౌర్య, డైరెక్టర్‌ విమల్‌ కృష్ణ, నిర్మాత సెవెన్‌ హిల్స్‌ సతీష్‌ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భగా నాగశౌర్య మాట్లాడుతూ మంచి కథతో తీసిన బొమ్మ బ్లాక్‌బస్టర్‌ ట్రైలర్‌, పాటలు చూస్తుంటే ఈ సినిమా చూడాలనిపిస్తోంది. నందు, రష్మీ బాగా నటించారు. ఈ సినిమా టైటిల్‌లాగానే బ్లాక్‌ బస్టర్‌ కావాలి అన్నారు. నందు విజయ్‌కృష్ణ మాట్లాడుతూ  నాపై నమ్మకంతో ఈ చిత్రకథ వినకుండా నటించారు రష్మి. ఈ చిత్రాన్ని నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్లిన నిర్మాతలకు థ్యాంక్స్‌ అన్నారు.  మా సినిమాను ప్రేక్షకులు ఆశీర్వదించాలి అన్నారు నిర్మాతలు.  నాది, నందూది 14 ఏళ్ల జర్నీ, రాజ్‌ విరాట్‌ కథను నుందు నమ్మితే నేను నందును నమ్మి ఈ సినిమా చేశా అన్నారు రష్మి. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా అందరి నచ్చుతుంది  అన్నారు రాజ్‌ విరాట్‌. ఈ కార్యక్రమంలో సెవెన్‌హిల్స్‌ సతీశ్‌, శ్రీను, శేషాద్రి, సుడిగాలి సుధీర్‌, ధన్‌రాజ్‌,  సత్యం రాజేశ్‌తో పాటు, సంగీత దర్శకుడు ప్రశాంత్‌ ఆర్‌.విహారి తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events