Skip to main content

Namaste NRI

కోటికొక్కడు పాటల హంగామా

సుదీప్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కే 3 కోటికొక్కడు. శివ కార్తిక్‌ దర్శకుడు. కన్నడంలో మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రాన్ని శ్రేయాస్‌ శ్రీనివాస్‌, దేవేంద్ర డీకే తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.  ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ పాలట విడుదల వేడుకని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రేయాస్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ పాండమిక్‌ వల్ల ఈ సినిమా విడుదల ఆసల్యమైంది. సుదీప్‌ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్ల సాధించిన చిత్రంగా నిలిచింది. తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అన్ని అంశాలున్న చిత్రమిది. ఎక్కువ శాతం విదేశాల్లో చిత్రీకణ జరుపుకుంటుంది. నాలుగు పాటలు అద్భుతంగా ఉన్నాయి అన్నారు. కన్నడంలో బ్లాక్‌బస్టర్‌ మూవీ ఇది. డబ్బింగ్‌ సినిమా అయినప్పటికీ తెలుగులో ప్రత్యేకంగా పాటలు పాడిరచారు. పటాకీ పోరి అనే పాట బాగా వచ్చింది అని గాయకుడు సింహా తెలిపారు. ఈ నెల 13న జరిగే ముందస్తు విడుదల  వేడుకకి సుదీప్‌ హాజరవుతున్నార న్నారు. ఈ చిత్రం ప్రేక్షకుల మనసు గెలుస్తుందనే నమ్మకం ఉందన్నారు నిర్మాత సాయికృష్ణ.  ఈ కార్యక్రమంలో నిర్మాత వివేక్‌ కూచిభొట్ల, గాయకుడు సింహా పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events