Skip to main content

Namaste NRI

యూఏఈ మరో కీలక నిర్ణయం

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2023 జూన్‌ నుంచి కార్పొరేట్‌ పన్ను విధించనున్నట్టు ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో వెల్లడిరచింది. రూ.76.18 లక్షలు (3.75 లక్షల యూఏఈ దిర్హామ్‌) కంటే ఎక్కువ వ్యాపార లాభాలపై తొమ్మిది శాతం పన్ను కట్టాల్సి ఉంటుందని తెలిపింది. పన్నుల విషయంలో బహుళజాతి సంస్థలకు ఈ దేశం దీర్ఘకాలంగా స్వర్గధామంగా ఉంది. అనేక ఎంఎన్‌సీల ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. కార్పొరేట్‌ ట్యాక్స్‌ను ప్రవేశపెట్టడం ద్వారా పారదర్శకత, హానికర పన్ను విధానాల కట్టడి విషయంలో యూఈఏ తన నిబద్ధతను మరోసారి చాటుకుంటుంది అని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి యూనిస్‌ హాజీ అల్‌ ఖూరి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్‌ ట్యాక్సుల్లో తొమ్మిది శాతమే అత్యంత తక్కువని పేర్కొన్నారు. ముడి చమురు ఎగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే క్రమంలో యూఏఈ కొన్నాళ్లుగా ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెడుతోన్న విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News