Namaste NRI

అమెరికాలో మరోసారి కాల్పుల మోత

అమెరికాలో మరోసారి తుపాకులు మోగాయి. ఫిలడెల్ఫియాలో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోగా 11 మంది గాయపడ్డారు.  బార్లు, రెస్టారెంట్లు, వినోద కార్యక్రమాలకు పేరున్న సౌత్‌ స్ట్రీట్‌ ప్రాంతో  ఘటన చోటు చేసుకుందని ఫిలడెల్ఫియా  పోలీసులు తెలిపారు. వీకెండ్‌ పార్టీ జరుపుకుంటున్న వందలాదిపై దుండగులు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డారు. చనిపోయిన ఇద్దరు పరుషులు, ఒక  మహిళ వివరాలతో పాటు గాయపడిన దుండగుడి గురించి పోలీసులు  సమాచారం వెల్లడిరచలేదు. క్షతగాత్రుల పరిస్థితి ఏమిటన్నది తెలియరాలేదు. అయితే ఘటనలో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, అయితే రెండు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాల్పులకు కారణాలు సైతం తెలియ రాలేదు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events