Namaste NRI

అప్పుడు అమెరికా చేసిన తప్పులే మీరూ చేయొద్దు

 ఇజ్రాయెల్ సేనలకు, హమాస్‌ మిలిటెంట్లకు మధ్య పోరు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇజ్రాయెల్‌కు కీలక హెచ్చరిక చేశారు. హమాస్‌ను ఎదుర్కొనే విషయంలో ఆవేశం వద్దని, 9/11 దాడి అనంతరం అమెరికా చేసిన తప్పులనే ఇజ్రాయెల్ చేయవద్దని, ఆ తప్పుల నుంచి ఇజ్రాయెల్ గుణపాఠం నేర్చుకోవాలని బైడెన్‌ సూచించారు. నేను ఇజ్రాయెల్‌లో పర్యటించిన సమయంలో 9/11 దుర్ఘటన వల్ల అమెరికా అనుభవించిన నరకాన్ని గుర్తుచేశాను. అప్పుడు తీవ్ర ఆగ్రహానికి గురైన విషయాన్ని తెలియజేశాను. అప్పుడు మేం న్యాయం కోసం ఆవేశంగా వెళ్లి తప్పులు చేశామని, అందుకే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఆవేశంతో కళ్లు మూసుకుపోయి వ్యవహరించవద్దని, ఆలోచించి అడుగులు వేయాలని, ఇజ్రాయెల్‌ ప్రభుత్వానికి బైడెన్‌ సూచించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events