Skip to main content

Namaste NRI

వచ్చే వారం నుంచి ఈ నిబంధనలు అమలు:  బ్రిటన్‌ ఆంక్షలు

విదేశీ వర్కర్ల వీసా నిబంధనలను బ్రిటన్‌ ప్రభుత్వం కఠినతరం చేసింది. వలసలకు అడ్టుకట్ట వేయడం కోసం విదేశీ వర్కర్లు తమ కుటుంబ సభ్యులను తీసుకురాకుండా ఆంక్షలు విధించింది. వచ్చే వారం నుంచి ఈ నిబంధనలు అమలు కానున్నాయి. లక్ష మంది వర్కర్లకు తోడుగా 1.20 లక్షల మంది కుటుంబసభ్యులు రావడంతో ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లు యూకే హోమ్‌ ఆఫీస్‌ తెలిపింది.  ఈ నిబంధనలతో వలసల ను సంతులిత స్థాయికి తీసుకురావాలని సునాక్‌ సర్కారు భావిస్తున్నది. కొత్త నిబంధనల ప్రకారం వీసా దరఖా స్తుదారుల, వలసదారుల కేర్‌ ప్రొవైడర్లు కేర్‌ క్వాలిటీ కమిషన్‌ వద్ద తమ వివరాలు నమోదు చేసుకోవాలి. యూకే లో డిగ్రీ చదివే అంతర్జాతీయ విద్యార్థులు ఇకపై తమ పిల్లలు, తల్లిదండ్రులు లేదా తమపై ఆధారపడి న ఇతర వ్యక్తులను తీసుకురావడానికి వీలుండదు. డిగ్రీ అయ్యాక ఆరు నెలల్లోగా ఉద్యోగం తెచ్చుకోవాలి. లేదంటే దేశం విడిచి వెళ్లిపోవాలి.

Social Share Spread Message

Latest News