Skip to main content

Namaste NRI

27 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై కలుస్తున్నారు

ప్రభుదేవా, కాజోల్‌ కాంబినేషన్‌ (1997)లో  మెరుపు కలలు చిత్రంలో నటించారు. మెరుపు కలలు సినిమా తర్వాత ప్రభుదేవా, కాజోల్‌ కలిసి నటించలేదు. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఈ అగ్ర తారలిద్దరూ ఓ సినిమాలో నటిస్తుండటం విశేషం. వివరాల్లోకి వెళితే  తెలుగు యువకుడు చరణ్‌తేజ్‌ ఉప్పలపాటి దర్శకత్వంలో కాజోల్‌, ప్రభుదేవా ప్రధాన పాత్రల్లో ఓ బాలీవుడ్‌ చిత్రం తెరకెక్కుతున్నది.

యాక్షన్‌ థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నసీరుద్దీన్‌షా, జిషుసేన్‌ గుప్తా, సంయుక్త మీనన్‌ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయింది. త్వరలో టీజర్‌ను విడుదల చేయబో తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ప్రభుదేవా-కాజోల్‌ జోడీ వెండితెరపై సందడి చేయబోతుండటం విశేషం గా చెప్పుకుంటున్నారు.

Social Share Spread Message

Latest News