Skip to main content

Namaste NRI

ఈ దేశమే నా ఇల్లు … నేను అమెరికా వెళ్లట్లేదు

త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల తర్వాత అమెరికా తరలి వెళ్లిపోతారంటూ తనపై జరుగుతున్న ప్రచారంపై బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషి సునాక్‌ స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు. తాను ఎక్కడికి వెళ్లిపోవడం లేదని,  బ్రిటన్‌ తన సొంత ఇల్లు అని స్పష్టం చేశారు. రిషి సునాక్‌ కొన్ని వారాల్లో తన కుటుంబంతో కలిసి అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లిపోవాలని ప్రణాళికలు రచిస్తున్నారంటూ సొంత పార్టీ అయిన కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన నేత, మాజీ మంత్రి జాక్‌ గోల్డ్‌స్మిత్‌ ఇటీవలే ఆరోపించిన విషయం తెలిసిం దే. దీంతో ఇదికాస్తా ఆ దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అంశంపై తాజాగా సునాక్‌ స్పందిం చారు. అమెర్‌శామ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో,  ఆ ఆరోపణలను కొట్టిపారేశారు.

జాక్‌ గోల్డ్‌స్మిత్‌ మాటలు వింటుంటే ఆశ్చర్యమేస్తోంది. ఆయనతో మాట్లాడక చాలా రోజులైంది. కానీ, మా కుటుంబ విషయాల గురించి అవగాహన ఉన్నట్లు ఆయన చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. అయినా నేను బ్రిటన్‌ వదిలి ఎక్కడికీ వెళ్లడం లేదు. ఈ దేశమే నా ఇల్లు. సౌంతాప్టన్‌లో పుట్టి పెరిగాను. ఇక్కడే ఉంటా. ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే విలువలకు నేను కట్టుబడి ఉన్నాను. నా కుటుంబాన్ని ఇక్కడి నుంచి వేరే చోటుకు తరలించే ఉద్దేశం లేదు. ఇక్కడే ఉంటూ,  ప్రజలకు సేవచేస్తూ,  సెయింట్‌ మేరీస్‌ స్టేడియంలో సౌతాంప్టన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ మ్యాచ్‌లు చూస్తూ సంతోషంగా గడపాలనుకుంటున్నా అని సునాక్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News