Skip to main content

Namaste NRI

ఫ్యామిలీతో కలసి చూడాల్సిన సినిమా ఇది

నాగశౌర్య, షిర్లీ సేథియా జంటగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మల్పూరి నిర్మించిన చిత్రం కృష్ణ వ్రింద విహారి. రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదలైంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ థాంక్ యూ మీట్ని హైదరాబాద్లో నిర్వహించింది. ఈ వేడుకలో నిర్మాత ఉషా మూల్పూరి మాట్లాడుతూ ఫ్యామిలీతో అందరూ కలసి థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. ఒక రెండు గంటల పాటు అన్ని ఒత్తిళ్ళు పొగొట్టి మనసుని హాయితో నింపే సినిమా ఇది అని తెలిపారు. దర్శకుడు అనీష్ ఆర్ మాట్లాడుతూ కృష్ణ వ్రింద విహారి సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయని తెలిపారు. నాగశౌర్య మాట్లాడుతూ మా సినిమాని ఆదరించి గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. సత్య, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్ సహా అందరూ నటులు చాలా అద్భుతంగా చేశారు. వారితో కలసి చేసిన సీన్స్కి థియేటర్లో అద్భుతమైన స్పందన వస్తోంది అని చెప్పారు. ఈ వేడుకలో రాహుల్ రామకృష్ణ, సత్య, హిమజ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events