Skip to main content

Namaste NRI

ఇది అలాంటి సినిమానే… రక్షిత్‌ శెట్టి

రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం సప్త సాగరాలు దాటి . హేమంత్‌ ఎం రావు డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ లీడింగ్ బ్యానర్ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ విడుదల చేస్తోంది.  ఈ మూవీ ట్రైలర్‌ను న్యాచురల్ స్టార్‌ నాని డిజిటల్‌గా లాంఛ్ చేశాడు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రక్షిత్‌శెట్టి మాట్లాడుతూ పాన్‌ ఇండియా సినిమాలు ప్రత్యేకంగా తీయాల్సిన పనిలేదు. కొన్ని సినిమాలు వాటంతటవే పాన్‌ ఇండియా స్థాయికి వెళతాయి. ఇది అలాంటి సినిమానే. ఇక్కడ కన్నడవెర్షన్‌ రెండు షోలతో విడుదల చేశాం. కొన్ని రోజుల్లోనే పదుల సంఖ్యలో షోలు పెరిగిపోయాయి. ఓ విధంగా విడుదలకు ముందే హిట్‌ అయిన సినిమా ఇది అని చెప్పారు. ఈ సినిమాకు తెలుగురాష్ర్టాల్లో అభిమానులున్నారనీ, అందుకే తెలుగులో విడుదల చేస్తున్నామని వివేక్‌ కూచిభొట్ల తెలిపారు. ఛైత్ర జే అచర్‌ అచ్యుత్ కుమార్‌ పవిత్రా లోకేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి చరణ్‌రాజ్‌ సంగీతం అందించాడు. సెప్టెంబర్ 22న విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events