Skip to main content

Namaste NRI

ఇది తెలుగు ప్రజల విజయం:  శివకృష్ణ

ఎన్నారై టీడీపీ బెల్జియం ప్రెసిడెంట్ అలవాలపాటి శివకృష్ణ, కోశాధికారి కొండయ్య కావూరి, రీజనల్ సమన్వ యకర్త దినేష్ వర్మ కోడూరి, జనసేన నాయకులు ప్రవీణ్ జరుగుమల్లి ఆధ్వర్యంలో కూటమి విజయో త్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ శివకృష్ణ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఇదో చారిత్రాత్మక విజయమని అభివర్ణించారు. ఇంతటి విజయాన్ని ఇచ్చిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు యావత్ రాష్ట్ర ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.  ఇది కొన్ని పార్టీలు కలిసి సాధించిన విజయమే కాదు. నా భూమి నాది అని చెప్పుకోలేని పరిస్థితి నుండి, విముక్తి కలగాలి అని ఓటు వేసి గెలిపించిన రైతు ది ఈ విజయం. నా రాష్ట్ర రాజధాని కోసం నా భూమి అని 30,000 ఎకరాలు ఇచ్చిన రైతన్నల కుటుంబాలది ఈ విజయం. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే పదం కోసం కదం తొక్కిన ప్రతి కార్యకర్తది ఈ విజయం. జనం కోసం పవన్ కళ్యాణ్ అనే నాయకుడి కోసం కాలు దువ్విన కుర్ర కారులది ఈ విజయం. దేశ భవిష్యత్తు కోసం కలిసి నడుద్దాం అని కౌగిలించిన కమల దళం ది విజయం. ఇది తెలుగు ప్రజల ఘన విజయం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై  బెల్జియం టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అనంతరం జూమ్ మీటింగ్‌లో భాను ప్రకాష్ మాగులూరి, మన్నవ సుబ్బారావు (మాజీ  టీడీపీ గుంటూరు మిర్చి యార్డు చైర్మన్), రాయపాటి అరుణ ( జనసేన నాయకురాలు), యష్ బొదలూరి, స్వాతి రెడ్డి, చలసాని కిషోర్ బాబు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News