Skip to main content

Namaste NRI

ఈ సినిమా ఆయన పేరు నిలబెట్టేలా ఉంటుంది.. వాల్మీకి

సన్ స్టూడియో బ్యానర్ పై, శ్రీనిధి క్రియేషన్స్ సమర్పణలో నిర్మిస్తున్న తాజా చిత్రం జంధ్యాల గారి జాతర 2.0. క్రిష్‌, కష్వీ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. సన్‌ స్టూడియో నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాల్మీకి దర్శకుడు. ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో మొదలైంది. ఇది కామెడీ సినిమా అని టైటిలే చెబుతుంది. నాకుమార్తె శ్రీలు ఇందులో నటించడం ఆనందంగా ఉంది అని కామెడీ నటుడు పృధ్వీ చెప్పారు.  జంధ్యాలగారి పేరిట వస్తున్న ఈ సినిమా ఆయన పేరు నిలబెట్టేలా ఉంటుందని దర్శకుడు చెప్పారు.  హీరో క్రిష్ సిద్దిపల్లి మాట్లాడుతూ సినిమా ఆధ్యాంతం హాస్య భరితంగా ఉంటుందని, ప్రేక్షకులకు విందు భోజనం లాంటి సినిమా అని పేర్కొన్నారు. బ్రహ్మానందం, వెన్నెల కిశోర్‌, రఘుబాబు, సత్య, అజయ్‌ఘోష్‌, రాజీవ్‌కనకాల, ప్రిన్స్‌, నాగినీడు తదితరులు నటిస్తున్నారు.  ఈ చిత్రానికి కెమెరా: విజయ్‌ ఠాగూర్‌, సంగీతం: వంశీకృష్ణ, సమర్పణ: శ్రీనిధి క్రియేషన్స్‌.  ఈ కార్యక్రమంలో హీరో క్రిష్ సిద్దిపల్లి, హీరోయిన్ కష్వీ, కమెడియన్ పృద్వి, నటుడు రఘుబాబు, యాని మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News