Skip to main content

Namaste NRI

నా కెరీర్‌కి ఈ పాత్ర మైలురాయి లాంటిది : రాజీవ్‌ కనకాల

రాజీవ్‌ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్‌ వెంకట్‌ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన వెబ్‌ సిరీస్‌ డాటర్‌ ఆఫ్‌ ప్రసాద్‌రావు. కృష్ణ పోలూరు దర్శకుడు. కె.వి.శ్రీరామ్‌ నిర్మాత. ఈ సందర్భంగా ఈ సిరీస్‌లోని రెండు ఎపిసోడ్స్‌ని హైదరాబాద్‌లో మీడియాకు ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రాజీవ్‌ కనకాల మాట్లాడుతూ నా కెరీర్‌కి ఈ పాత్ర మైలురాయి లాంటిది. ఇందులో నా పాత్ర తీరుతెన్నులు, మాడ్యులేషన్‌ కొత్తగా ఉంటాయి. ఇంతమంచి పాత్ర ఇచ్చిన ఈ టీమ్‌కు థ్యాంక్స్‌ చెప్పుకుంటున్నా అన్నారు.

ప్రతి ఒక్క తండ్రికీ కనెక్టయ్యే సిరీస్‌ ఇదని నిర్మాత కె.వి.శ్రీరామ్‌ పేర్కొన్నారు. రెండేళ్లు ఎంతో ఇష్టపడి ఈ కథ రాసుకున్నానని దర్శకుడు కృష్ణ పోలూరు చెప్పారు. ఇంకా ఇందులో కీలక పాత్రలు పోషించిన ఉదయభాను, గాయత్రిభార్గవి, వాసంతికలతోపాటు డైలాగ్‌ రైటర్‌ శృతి, డీవోపీ మహేష్‌, జీ తెలుగు ప్రతినిధి జయంత్‌ రాఘవన్‌ కూడా మాట్లాడారు. ఫిబ్రవరి 27న జి5లో స్ట్రీమింగ్‌ కానుంది.

Social Share Spread Message

Latest News