Namaste NRI

టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్‌ వచ్చేస్తోంది

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ అభిషేక్ అగర్వాల్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వరరావు. నూపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.   అడవిలో పులిని వేటాడే విధంగా రవితేజ తన ప్రత్యర్థులపై దాడి చేస్తున్నట్లు ప్రెజెంట్ చేసిన మాస్ అప్పీలింగ్ పోస్టర్ ద్వారా ట్రైలర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. పోస్టర్ లో బీడీ తాగుతూ డాషింగ్ గా కనిపిస్తున్నారు రవితేజ. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున ఈ చిత్రం నుంచి ఇప్పటివరకూ రెండు పాటలను విడుదల చేశారు మేకర్స్. ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలకు మంచి స్పందన వస్తున్నది. అక్టోబర్ 20న గ్రాండ్‌ గా విడుదల కానుంది.  ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఆర్‌ మదీ ఐఎస్‌సి, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ కాగా, మయాంక్ సింఘానియా,  సహ నిర్మాత. సహనిర్మాత: మయాంక్‌ సింఘానియా.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events