Skip to main content

Namaste NRI

రూ.120 కోట్లతో తెలుగులోకి టాక్సిక్‌

కన్నడ అగ్ర నటుడు యశ్‌ దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ఆయన టాక్సిక్‌: ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు. ఈ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా పాన్‌ ఇండియా స్థాయిలో మార్చి 19న ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా ఈ సినిమా తెలుగు హక్కులను అగ్ర నిర్మాత దిల్‌ రాజు 120కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారు.

ఇటీవలకాలంలో ఇదే బిగ్గెస్ట్‌ డీల్‌ అంటున్నారు. 1980 గోవా నేపథ్యంలో గ్యాంగ్‌వార్‌ డ్రామా ఇదని, యశ్‌ పాత్ర సరికొత్త పంథాలో ఉంటుందని చెబుతున్నారు. యశ్‌ నుంచి నాలుగేళ్ల తర్వాత వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయని, ఇలాంటి ప్రెస్టేజియస్‌ మూవీని తమ సంస్థ ద్వారా తీసుకురావడం ఆనందంగా ఉందని దిల్‌ రాజు పేర్కొన్నారు. కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ పతాకాలపై వెంకట్‌ కె నారాయణ, యశ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Social Share Spread Message

Latest News