Skip to main content

Namaste NRI

అమెరికా మాజీ అధ్యక్షుడి ఇంట విషాదం.. ట్రంప్‌ మొదటి భార్య

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మొదటి భార్య ఇవానా ట్రంప్‌ కన్నుమూశారు. ఆమె వయసు 73 ఏళ్లు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇవానా ట్రంప్‌కు జూనియర్‌ డోనాల్డ్‌, ఇవాంకా ట్రంప్‌, ఎరిక్‌ అనే పిల్లలు ఉన్నారు. వారంటే ఆమెకు ఎంతో ఇష్టమని, ఆమె ఎంతో గర్వపడేదని అన్నారు. న్యూయార్క్‌ సిటీలోని తన ఇంట్లో ఇవానా ట్రంప్‌ మృతి చెందినట్లు డొనాల్డ్‌ ట్రంప్‌ తన సోషల్‌ మీడియా పోస్టులో తెలిపారు. ఆమె ఓ అద్భుతమైన ఆందమైన మహిళ అని, ప్రేరణాత్మక జీవితాన్ని ఆమె గడిపినట్లు డోనాల్డ్‌ ట్రంప్‌ తన పోస్టులో తెలిపారు. ఇవానా రెస్ట్‌ ఇన్‌ పీస్‌ అంటూ తన పోస్టులో డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు.

                 చెక్లస్లోవేకియాకు చెందిన మాజీ మోడల్‌ అయిన ఇవానాను 1977లో డొనాల్డ్‌ పెళ్లి చేసుకున్నారు. డొనాల్డ్‌, ఇవానా ట్రంప్‌లు 90 తొలి నాళ్లలో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 1993లో మేపల్స్‌ను డొనాల్డ్‌ పెళ్లి చేసుకున్నారు. వారి దాంపత్యం 1999 వరకు సాగింది. ఆ తర్వాత 2005లో మెలానియా ట్రంప్‌ను డోనాల్డ్‌ ట్రంప్‌ పెళ్లాడారు. ఇవానా ట్రంప్‌ వ్యక్తిగతంగా మేటి వ్యాపారి. క్లాతింగ్‌ జ్వలరీ, బ్యూటీ ప్రొడక్ట్స్‌లో ఆమె వ్యాపారం నిర్వహించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events