Skip to main content

Namaste NRI

నల్లమల ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌తో కలియుగం పట్టణంలో ట్రైలర్

విశ్వకార్తికేయ, ఆయూషి పటేల్‌ జంటగా నటిస్తున్న చిత్రం కలియుగం పట్టణంలో. రమాకాంత్‌ రెడ్డి దర్శక త్వం వహిస్తున్నారు. కందుల చంద్ర ఓబుల్‌ రెడ్డి, జి.మహేశ్వర్‌ రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం  ట్రైలర్‌ను విడుద ల చేశారు. లవ్‌, క్రైమ్‌, థ్రిల్లర్‌ అంశాలతో ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. నల్లమల ఫారెస్ట్‌ నేపథ్యం లో థ్రిల్లింగ్‌ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. క్రైమ్‌ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, ఆద్యంతం అనూహ్య మలుపులతో ఉత్కంఠను పంచుతుందని దర్శకుడు తెలిపారు. సినిమా షూటింగ్‌ మొత్తం కడప పట్టణంలో జరిపామని నిర్మాతలు తెలిపారు. ఈ నెల 29న విడుదకానుంది. ఈ చిత్రానికి కెమెరా: చరణ్‌ మాధవనేని, సంగీతం: అజయ్‌ అరసాడ, దర్శకుడు: రమాకాంత్‌ రెడ్డి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events