Skip to main content

Namaste NRI

స్వరం మార్చిన ట్రూడో…ఆ దేశంతో పనిచేయాల్సిన అవసరం

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య విషయంలో భారత్‌పై అసాధారణ ఆరోపణలు చేసిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో  తాజాగా తన స్వరం మార్చారు. భారత్‌తో దృఢమైన సంబంధాలు ఏర్పరుచుకునేందుకు కట్టుబడి ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. ఈ మేరకు మాంట్రియల్‌లో మీడియాతో ట్రూడో మాట్లాడారు.భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తి. భౌగోళిక రాజకీయాల పరంగా ముఖ్యమైన దేశం. భారత్‌తో దృఢమైన బంధాన్ని పెంపొందించుకునేందుకు మేము కట్టుబడి ఉన్నాం. మేం గతేడాదే మా ఇండో-పసిఫిక్‌ వ్యూహంతో ముందుకొచ్చాం. భారత్‌తో చట్టబద్ధ పాలనకు చాలా సీరియస్‌గా పనిచేస్తున్నాం అని వ్యాఖ్యానించారు.నిజ్జర్‌ హత్య విషయంలో అమెరికన్లు తమతోనే ఉన్నారని ట్రూడో ప్రకటించారు. ఈ విషయంలో కెనడా, దాని మిత్రదేశాలు భారత్‌తో కలిసి నిర్మాణాత్మకంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో చట్టాలను అనుసరించే దేశంగా,  నిజ్జర్‌ హత్య విషయంలో వాస్తవాలను వెలికి తీసేందుకు మాతో కలిసి భారత్‌ పనిచేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

Social Share Spread Message

Latest News