Skip to main content

Namaste NRI

బైడెన్‌పై ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు… ఆయనకు సరిగా

అమెరికాలో 2024 అధ్యక్ష ఎన్నికల వేడి మొదలైంది. రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌పున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఈ సందర్భంగా తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్‌ ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ మతిపరుపు, తడబాట్ల కారణంగా నిత్యం విమర్శల పాలవుతున్న విషయం తెలిసిందే. ఏదో ఒక పొరపాటు చేస్తూ మీడియాకు చిక్కుతున్నారు. తన పర్యటనలు, ఇతర సందర్భాల్లో విమానం ఎక్కుతూ అనేకసార్లు మెట్లపై కింద పడిపోయారు. మెట్లపైనే కాదు ఇటీవలే కొలరాడోలో అమెరికా వైమానిక దళ అకాడమీ లో జరిగిన గ్రాడ్యుయేషన్‌ వేడుకల్లోనూబైడెన్‌ ఒక్కసారిగా కాలు స్లిప్‌ అయ్యి కిందపడిపోయారు. ఈ నేపథ్యంలోనే మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు బైడెన్‌ సిద్ధమవుతున్న వేళ వీటిని ఉద్దేశించి ట్రంప్‌ విమర్శలు చేశారు.

అతను మెట్ల దారిని సరిగా గుర్తించలేరు. వేదికపైకి రాలేరు. ఈ స్టేజ్‌ చూడండి ఎంత చెత్తగా ఉందో. అయినా కుడి, ఎడమ వైపు మెట్లను నేను బాగా గుర్తించగలను. అయితే, ఆ వ్యక్తి మాత్రం పైకి లేచి నిలబడి నేను ఎక్కడున్నాను? అని ప్రశ్నిస్తారు అంటూ బైడెన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Social Share Spread Message

Latest News