Skip to main content

Namaste NRI

పుతిన్‌కు మరో షాక్‌ ఇచ్చిన ఉక్రెయిన్‌

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు ఇప్పుడు మరో షాక్‌ తలిగింది. ఉక్రెయిన్‌లోని రష్యన్ల ఆస్తులను సీజ్‌ చేశారు.  అంతర్జాతీయ శాంతికి విఘాతం కలిగించేలా రష్యా వ్యవహరిస్తోందని పలు దేశాలు అరోపిస్తున్నాయి. తాజాగా పుతిన్‌కు మరో షాక్‌ తగిలింది. ఈ షాక్‌ ఇతర దేశాల నుంచి కాకుండా తాను దండెత్తి వచ్చిన ఉక్రెయిన్‌ నుంచే ఎదురైంది. రష్యా యుద్దోన్మాదం కారణంగా తమ దేశంలోని రష్యన్ల ఆస్తులను సీజ్‌ చేయాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌ స్కీ ఓ సరికొత్త ప్రతిపాదనను తమ దేశ పార్లమెంటు ముందు ఉంచారు. పుతిన్‌ ఇమేజీని దెబ్బ తీసేదిగా భావిస్తున్న ఈ తరహా చర్యకు జెలెన్‌ స్కీ చాలా తెలివిగా ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. జెల్‌న్‌ స్కీ ప్రతిపాదనకు ఉక్రెయిన్‌ పార్లమెంటు అప్పటికప్పుడే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. దీంతో  ఉక్రెయిన్‌లోని రష్యన్ల ఆస్తుల సీజ్కు సంబంధించిన చట్టం అమల్లోకి వచ్చేసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events