ఉక్రెయిన్ దక్షిణ, తూర్పు ప్రాంతాల ప్రజలు రష్యాలో శాశ్వత విలీనాన్ని కోరుకుంటున్నట్లు ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైందని రష్యా వర్గాలు ప్రకటించారు. సైనిక దళాలు, ఎన్నికల అధికారులు ఐదు రోజుల పాటు ఇంటింటికి వెళ్లి రెఫరెండం నిర్వహించినట్లు తెలిపారు. దీని ఫలితాలను అధికారులు వెల్లడిరచారు. రష్యాలో విలీనం కావడానికి దొనెట్స్క్ ప్రావిన్సులో 99 శాతం మంది అనుకూలంగా ఓటు వేసినట్లు రష్యా నియమించిన ఎన్నికల అధికారులు వెల్లడిరచారు. లుహాన్స్క్‌లో 98 శాతం, జపోరిజియాలో 93 శాతం, ఖేర్సన్‌లో 87 శాతం మంది విలీనానికి మద్దతుగా స్పందించారని ప్రకటించారు. ఖేర్సన్, జపోరి జియా, లుహాన్స్క్, డొనెట్స్క్ ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకునే కార్యక్రమం లాఛనంగా ఈనెల 30న పూర్తికావచ్చు. అయితే ఉక్రెయిన్, అమెరికా, ఐరోపా దేశాలు మాత్రం ఈ ప్రజాభిప్రాయ సేకరణను బూటకమని కొట్టి పారేశాయి.














