Namaste NRI

తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విట్జర్లాండ్ ఆధ్వర్యంలో… ఘ‌నంగా  దీపావళి వేడుకలు

తెలుగు అసోసియేష‌న్ ఆఫ్ స్విట్జ‌ర్లాండ్ ఆధ్వ‌ర్యంలో అక్టోబ‌ర్ 30 న   జ్యురీచ్ న‌గ‌రంలో దీపావ‌ళి వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. భార‌త సంప్ర‌దాయం ఉట్టిప‌డేలా సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. చిన్నారుల ఆట‌పాట‌ల‌తో ఈ వేడుక‌లు క‌న్నుల‌పండువ‌గా కొన‌సాగాయి. దీపావ‌ళి వేడుక‌ల్లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విటర్లాండ్ ప్రెసిడెంట్ గనికాంబ కడలి, జనరల్ సెక్రెటరీ డాక్ట‌ర్ దుర్గారావు కారంకి, ట్రెజరర్ మాధురి ముళ్ళపూడి, కల్చరల్ సెక్రెటరీ మాణిక్యవల్లి చాగంటి, స్పోర్ట్స్ సెక్రెటరీ రామచంద్ర వుట్టి, ఇతర తెలుగు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.   ఈ వేడుక‌ల్లో తెలుగు రాష్ట్రాల‌కు చెందిన 400 మంది పాల్గొని విజ‌య‌వంతం చేశారు.

Social Share Spread Message

Latest News