Skip to main content

Namaste NRI

హిట్‌ 2 నుంచి ఉరికె ఉరికె  వీడియో సాంగ్‌ ప్రోమో

అడివి శేష్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం హిట్‌ 2. మీనాక్షి చౌదరి కథానాయిక. శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. వాల్‌పోస్టర్‌ సినిమా పతాకంపై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్నారు. కథానాయకుడి నాని సమర్పకులు. వచ్చే నెల 2న ప్రేక్షకులు ముందుకు రానున్న ఈ సినిమాలోని ఊరికే ఊరికే అంటూ సాగే పాటని త్వరలోనే విడుదల చేయనున్నారు.  ప్రోమోని విడుదల  చేశారు. ఈ పాటలో అడవి శేష్‌, మీనాక్షి చౌదరి జంట మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. విజువల్స్‌, బాణీలు ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తాయి. ఈ పాటకి ఎం.ఎం. శ్రీలేఖ  స్వరాలు సమకూర్చగా, కృష్ణకాంత్‌ సాహిత్యం అందించారు. సద్‌శ్రీరామ్‌ ఆలపించారని సినీ వర్గాలు తెలిపాయి. పోసాని కృష్ణమురళి, తనికెళ్లభరణి, కోమలీ ప్రసాద్‌, రావు రమేశ్‌, బాను చందర్‌ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్‌, టీజర్లకు మంచి స్పందన వస్తోంది.

Social Share Spread Message

Latest News