Skip to main content

Namaste NRI

ఊర్వసివో రాక్షసివో ట్రైలర్‌ను విడుదల

అల్లు శిరీష్‌ హీరోగా నటించిన చిత్రం  ఊర్వసివో రాక్షసివో,  రాకేశ్‌ శశి దర్శకత్వం వహించారు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జీఏ-2 పిక్చర్స్‌, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. శిరీష్‌కు జోడీగా అను ఇమ్మాన్యూయెల్‌ హీరోయిన్‌గా నటించింది.    ఈ  చిత్రం నుండి రిలీజైన పోస్టర్‌లు, టీజర్‌లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.  ఈ చిత్రాన్ని నవంబర్‌ 4న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం వరుస అప్‌డేట్‌లను ప్రకటిస్తూ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీ క్రియేట్‌ చేస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్‌ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

తాజాగా రిలీజైన ట్రైలర్ ఆద్యంతం అకట్టుకుంటుంది. ‘తను కొరియన్‌ వెబ్‌ సిరీస్‌లా ట్రెండీగా ఉంటే, నువ్వేంట్రా కార్తికదీపం సీరియల్‌లో డాక్టర్ బాబు, వంటలక్కలాగా పేజీలు పేజీలు డైలాగ్స్‌ చెబుతున్నావ్‌’ అంటూ వెన్నెల కిషోర్‌ డైలాగ్స్ అలరిస్తున్నాయి. ట్రైలర్‌ మొత్తం ఫన్‌తో పాటు ఎంటర్‌టైనింగ్‌ ఉంది. ‘నేనిక్కడ నానా పటేకర్‌ రేంజ్‌లో పర్ఫామెన్స్‌ చేస్తుంటే.. నువ్వు కనీసం ఈటీవి ప్రభాకర్‌లా క్యాచ్‌ చేయలేకపోతున్నావ్‌’ అంటూ సునీల్‌ చెప్పే డైలాగ్స్ నవ్వులూ పూయిస్తున్నాయి. ట్రైలర్‌తో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. అనూప్‌రూబెన్స్, అచ్చు రాజమణి బాణీలు అందించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events