Namaste NRI

డివోషనల్‌ మిస్టీరియస్‌ థ్రిల్లర్‌గా  వారాహి

సుమంత్‌ హీరోగా దర్శకుడు  సంతోష్‌ జాగర్లపూడి కాంబినేషన్‌లో వారాహి మూవీ షురూ అయింది. జీకే మూమీ వేకర్స్‌ పతాకంపై రమాదేవి నారగాని నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సీన్‌కి నిర్మాణ సురేష్‌బాబు కెమెరా స్విచ్చాన్‌ చేయగా, దర్శకుడు  వీవీ వినాయక్‌ క్లాప్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా  సంతోష్‌  జాగర్లపూడి మాట్లాడుతూ  ఏడుగురు దేవతామూర్తుల్లో వారాహి అమ్మవారు ఒకరు. వరాహ స్వామి శక్తి ఉద్భవించిన వారాహి అమ్మవారి ఆలయ నేపథ్యంలో డిఓషనల్‌ మిస్టీరియల్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. డిసెంబర్‌లో రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలుపెడతాం అన్నారు. సుమంత్‌ మాట్లాడుతూ సంతోష్‌ ఈ కథ చెప్పగానే చప్పట్లు కొట్టాను. మా కాంబినేషన్‌లో వచ్చిన సుబ్రహ్మణ్యపురం కంటే చాలా మంచి స్క్రిప్ట్‌ ఇది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం : ఈశ్వర్‌ చంద్‌, సహనిర్మాత : కేఆర్‌ ప్రదీప్‌.

Social Share Spread Message

Latest News