వరుణ్‌తేజ్ హీరోగా తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. మానుషి చిల్లార్ కథానాయిక. సందీప్ ముద్దా నిర్మాత. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. వరుణ్‌తేజ్ ఇందులో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలెట్‌గా నటిస్తున్నారు. మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. నవదీప్ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. భారతదేశం ఎదుర్కొన్న అతిపెద్ద వైమానిక దాడుల నేపథ్యంలో యథార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కించాం. దేశభక్తి ప్రధానంగా ఆకట్టుకుంటుంది. మేజర్ వంటి విజయం తర్వాత సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉంది అని చిత్ర బృందం పేర్కొంది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యాడ్ ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్, వీఎఫ్‌ఎక్స్ నిపుణుడు శక్తి ప్రతాప్‌సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 8న విడుదల చేస్తారు.














