Skip to main content

Namaste NRI

ఆన్ ది రోడ్ మూవీ ట్రైలర్ ను విడుదల చేసిన వర్మ

పూర్తిగా లడఖ్‌ ప్రాంతంలో తెరకెక్కించిన తొలి భారతీయ చిత్రం ఆన్‌ ది రోడ్‌. రాఘవ్‌ తివారి, స్వామి మెహ్రా, కర్ణ్‌శాస్త్రి ప్రధాన తారాగణం. సూర్య లక్కోజు దర్శకత్వం వహిస్తూ, రాజేశ్‌ శర్మతో కలసి నిర్మించారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను, ట్రైలర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన సినిమాలోని విజువల్ మూడ్ ను, స్టైలిష్ లుక్ ను మెచ్చుకోవడమే కాకుండా ఇలాంటి అవుట్ పుట్ తీసుకువచ్చేందుకు కృషి చేసిన ఆన్ ది రోడ్ టీమ్ మెంబర్స్ ను ప్రశంసించారు, సినిమా విజయం సాధించాలని శుభాభినందనలు తెలియజేశారు.   ట్రైలర్‌ కొత్తగా ఉంది, సినిమా ప్రేక్షకాధరణ చూరగొంటుందని ముత్యాల రామ్‌దాస్‌ అన్నారు. కష్టనష్టాల కోర్చి సినిమాను అద్భుతంగా తెరకెక్కించామని రాఘవ్‌ చెప్పారు. నా మొదటి చిత్రమే లడఖ్‌ లాంటి అందమైన ప్రాంతంలో తెరకెక్కడం ఆనందంగా ఉందని స్వాతిమెహ్రా తెలిపారు. తెలుగు, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో విడుదలవుతోంది.

Social Share Spread Message

Latest News