Skip to main content

Namaste NRI

విధి ఫస్ట్ లుక్ లాంచ్‌

రోహిత్‌ నందా, ఆనంది జంటగా నటిస్తున్న చిత్రం విధి. శ్రీకాంత్‌ రంగనాథన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రంజిత్‌ నిర్మించారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. తెలుగు రాష్ర్టాల్లో పది లక్షల మంది కంటి చూపులేని వాళ్లున్నారు. అందులో చాలా మంది థియేటర్‌కు వెళ్లి ఉండకపోవచ్చు.  వారంతా థియేటర్‌కు వెళ్లి ఈ సినిమాను ఆస్వాదించవొచ్చు అన్నారు. విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించామని నిర్మాత తెలిపారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేసే కథాంశమిదని, హీరోయిన్‌ ఆనంది తెలిపింది. ఇప్పటివరకు తాను మ్యూజిక్‌ అందించిన చిత్రాల్లో ఇది పూర్తి భిన్నమైదనది సంగీత దర్శకుడు శ్రీచరణ్‌ పాకాల అన్నారు.

Social Share Spread Message

Latest News