Skip to main content

Namaste NRI

విజయ్ సేతుపతి, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో సినిమా.. షూటింగ్ ఎప్పట్నుంచో తెలుసా?

విజయ్‌ సేతుపతి హీరోగా పూరీ జగన్నాథ్‌ పాన్‌ ఇండియా సినిమా  అనే వార్త ఇండస్ట్రీలోనే కాక, జనబాహుళ్యంలోనూ చర్చనీయాంశం. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా విజయ్‌ సేతుపతి, పూరీజగన్నాథ్‌, చార్మి కౌర్‌ త్రయం కలిసి ఉన్న ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. నెవర్‌ బిఫోర్‌ అనేలా ఇందులో విజయ్‌ సేతుపతి కేరక్టర్‌ ఉంటుందని, డిఫరెంట్‌ అవతారంలో ఆయన కనిపించనున్నారని, తన కెరీర్‌లోనే విభిన్నమైన కథ ఇదని పూరీ జగన్నాథ్‌ తెలిపారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జూన్‌లో ప్రారంభం కానున్నదని, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయనున్నామని పూరీ, చార్మీ తెలిపారు. పూరి కనెక్ట్‌ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనుంది.

Social Share Spread Message

Latest News