Skip to main content

Namaste NRI

సాయిదత్త పీఠం ఆధ్వర్యంలో వైభవంగా..  వినాయక నవరాత్రి ఉత్సవాలు 

అమెరికాలోని న్యూజెర్సీలో సాయిదత్త పీఠం ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి.  ఈ సందర్భంగా లడ్డూ వేలం జరిగింది. ఈ వేలంలో ప్రవాసులు లడ్డూని రూ.6,06,367కు పాడుకున్నారు. హైదరాబాద్‌లోని బాలాపూర్‌ గణపతి లడ్డూలో మాదిరిగానే సాయిదత్త పీఠంలో ఏర్పాటు చేసిన గణపతి లడ్డూలో కూడా 10 ఔన్స్‌ల విలువైన సిల్వర్‌ (వెండి ) కాయిన్‌ పెట్టారు. ఘంటసాల సంగీత ఇంటర్నేషనల్‌ కళాశాల ప్రెసిడెంట్‌ మధు చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ న్యూజెర్సీ కమిషనర్‌ ఎమిరిటస్‌ ఉపేంద్ర చివుకుల ప్రశంసాపత్రాన్ని అందించారు.  తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న విఘ్నేశ్వరుడిని మేళ, తాళాల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.  నిమజ్జనానికి దాదాపు 1000 మందికి పైగా వచ్చారు. నిమజ్జన కార్యక్రమంలో పూజలు, డప్పు వాయిద్యాలు ఊరేగింపు నిర్వహించారు. భక్తులందరూ భక్తిపారవశ్యంలో మునిగితేలారు. చిన్నాపెద్దలు కలిసి ఆడిపాడారు.

Social Share Spread Message

Latest News