Namaste NRI

ప్రపంచమంతా మా చట్టం తెస్తాం

ఓవైపు గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు తీవ్రతరం చేస్తుండగా,  హమాస్ మరింత రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. హమాస్ కమాండర్ తమ సభ్యులకు ఓ కీలక సందేశాన్ని ఇచ్చాడు.  ఈ సందర్భంగా హమాస్ కమాండర్ మహ్‌మౌద్ అల్ జహార్  మాట్లాడుతూ  ఇజ్రాయెల్ తమ తొలి లక్షం మాత్రమేనని, యావత్ ప్రపంచంపై తమ ప్రభావాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని  ప్రకటించాడు. ఇజ్రాయెల్ కేవలం ప్రారంభ టార్గెట్ మాత్రమే. యావత్ భూగోళం మన చట్టం కిందకు రావాలి. యావత్ ప్రపంచంలో ఎలాంటి అన్యాయం, అణచివేత లేని వ్యవస్థ ఉండాలి. లెబనాన్, సిరియా, ఇరాక్ వంటి దేశాల్లో అరబ్‌లు, పాలస్తీనీయన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలు, హత్యలు ఇంకెక్కడా చోటుచేసుకోకూడదు అని అన్నాడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events