Skip to main content

Namaste NRI

వారికి అత్యాధునిక ఆయుధాలు అందిస్తాం

తమ మిత్ర దేశాలతో సంబంధాలకు రష్యా చాలా విలువ ఇస్తుందని, వారికి అత్యంత అధునాతన ఆయుధాలు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. సైనిక సహకారాన్ని విస్తరించుకోనున్నట్లు తెలిపారు. మాస్కోలో జరిగిన వార్షిక ఆయుధ ప్రదర్శన ప్రారంభోత్సంలో ఆయన ప్రసంగించారు. భిన్న ధ్రువ ప్రపంచాన్ని అభివృద్ధి చేయడంలో రష్యా ఆయుధ ఎగుమతులు కీలక పాత్ర పోషిస్తాయని పుతిన్‌ పేర్కొన్నారు. చిన్న చిన్న ఆయుధాల నుంచి ఆర్మర్డ్‌ వాహనాలు, వైమానిక దాడులను నిలువరించే ఆర్టిలరీ, మానవ రహిత వైమానిక ఆయుధాలు అన్నీ అందించేందుకు రష్యా రెడీగా ఉంది అని అన్నారు.  ఉక్రెయిన్‌పై సైనిక చర్యను సమర్థించుకున్నారు. మద్దతుగా నిలిచిన మిత్రపక్షాలను కొనియాడారు. పాశ్చాత్య దేశాలన్నీ రష్యాపై ఆంక్షలు విధించాయి. ఇలాంటి సమయంలో పుతిన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Social Share Spread Message

Latest News