Skip to main content

Namaste NRI

శ్రీలంకకు ప్రపంచ బ్యాంక్‌ షాక్‌.. అప్పటివరకు లేదు

ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకకు ప్రపంచ బ్యాంక్‌ షాక్‌ ఇచ్చింది. దేశంలో తగిన స్థూల ఆర్థిక విధాన కార్యచరణ అమల్లోకి వచ్చే వరకూ కొత్తగా రుణాలిచ్చే ప్రణాళికేది లేదని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. ఆర్థిక స్థిరీకరణపై దృష్టి సారించే దిశగా నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమని అభిప్రాయపడిరది. ఆర్థిక పునరుద్ధరణ, సమగ్ర అభివృద్ధి కోసం ప్రస్తుత సంక్షోభానికి కారణమైన మూల సమస్కలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది. దేశంలో తీవ్ర ఆర్థిక పరిస్థితులు, ప్రజలపై దాని ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేసింది. మందులు, వంట గ్యాస్‌, ఎరువులు, పాఠశాల పిల్లలకు భోజనం, పేద, బలహీన కుటుంబాలకు నగదు బదిలీ వంటి అవసరాల్లో కొరతను కాస్త తీర్చేలా ఇప్పటికే ఇచ్చిన రుణాలను పునర్‌వ్యవస్థీకరించినట్లు ప్రపంచ బ్యాంక్‌ వెల్లడిరచింది. ఇలా ఇప్పటివరకు దాదాపు 160 మిలియన్‌ డాలర్ల తోడ్పాటు అందించినట్లు తెలిపింది.

Social Share Spread Message

Latest News