ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డి స్టోరీ నేపథ్యంలో వచ్చిన బయోపిక్ యాత్ర. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి కొనసాగింపుగా యాత్ర 2 వస్తుందని తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి నిజ జీవితంలో చోటుచేసుకున్న ఘటనల ఆధారంగా ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి పాత్రలో కోలీవుడ్ యాక్టర్ జీవా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ముందు చెప్పినట్లుగానే యాత్ర 2 ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ ఫస్ట్ లుక్‌లో ఒకవైపు జీవా ఉండగా, మరోవైపు మమ్ముట్టి ఉన్నాడు. ఈ పోస్టర్‌లో నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను వైఎస్. రాజశేఖర్‌రెడ్డి కొడుకుని అంటూ పోస్టర్‌లో రాసుకోచ్చారు. దీనితో పాటు మేకర్స్ విడుదల తేదీ ప్రకటించారు. ఈ సినిమాను 2024 ఫిబ్రవరి 08న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ తెలిపారు.














