Skip to main content

Namaste NRI

చంద్రబాబుతో వైఎస్ షర్మిల భేటీ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తో ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి, కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. తన కుమారుడి పెళ్లికి చంద్రబాబు దంపతులను ఆహ్వానించి, శుభలేఖ అందించా రు. ఈ  సందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడారు. చంద్రబాబుతో తన భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్య మూ లేదన్నారు. తన కుమారుడి వివాహం సందర్భంగా చంద్రబాబును ఆహ్వానించాననీ, ఈ సందర్భంగా వైఎస్ తో తన అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారని షర్మిల చెప్పారు. తమ మధ్య రాజకీయంగా ఎలాంటి లావాదేవీలు లేవనీ, భవిష్యత్తులోనూ ఉండబోవనీ ఆమె తేల్చి చెప్పారు.  కాంగ్రెస్ అధిష్ఠానం తనకు ఏ బాధ్యత అప్పగిస్తే, ఆ బాధ్యత నెరవేర్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానన్నారు. రాహుల్ ప్రధాని అయితే దేశానికి మంచి జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

Social Share Spread Message

Latest News