Skip to main content

Namaste NRI

రష్యాపై జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు

ఉక్రెయిన్‌పై యుద్ధం కొసాగిస్తున్న రష్యా ఇటీవలే శాంతి  మంత్రాన్ని జపించడం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చల్లో భాగంగా రష్యా తన బలగాలను కొన్ని ప్రాంతాల నుంచి ఉపసంహరించుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. బలగాల ఉపసంహరణకు రష్యా ఇప్పటికే మొదటు పెట్టింది కూడా. ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ  కీలక ప్రకటన విడుదల చేశారు. రష్యాపై మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. బలగాల ఉపసంహరణ మాటున రష్యా దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. తమ దాడుల్లో చనిపోయిన ఉక్రెయిన్‌ పౌరుల శవాల కింద ల్యాండ్‌ మైన్లను రష్యా సైనికులు పెట్టి వెళ్లిపోతున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దాడుల్లో శిథిలమైన ఇళ్లలోనూ రష్యా సైనికులు ల్యాండ్‌ మైన్లను ఉంచి వెళుతున్నారని  వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రజలు తిరిగి తమ ఇళ్లకు వచ్చే విషయంలో ఎలాంటి తొందరపాటు న్ణియాలు తీసుకోవద్దని ఆయన సూచించారు.

Social Share Spread Message

Latest News