Skip to main content

Namaste NRI

అంతఃపురం తర్వాత ఇదే బెస్ట్‌ఫిల్మ్‌ : తమ్మారెడ్డి భరద్వాజ్‌

జగపతిబాబు, లయ, హృతిక శ్రీనివాస్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం వదలా. ఆకెళ్ల వి కృష్ణ దర్శకుడు. కిషోర్‌ నాయుడు, తమ్మారెడ్డి భరద్వాజ్‌ నిర్మాతలు. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ ఇలాంటి థ్రిల్లర్‌ మూవీ చేయడం ఆనందంగా ఉందని, కొత్త కంటెంట్‌తో ఈ సినిమా తీశారని తెలిపారు. తన నిర్మాణంలో అంతఃపురం తర్వాత ఇదే బెస్ట్‌ఫిల్మ్‌ అని, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించిందని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్‌ చెప్పారు. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News