రష్యా -ఉక్రెయిన్ యుద్ధం ముగించే దిశగా అమెరికా తీసుకొచ్చిన బిల్లులో కీలక మార్పులు చేసింది. ఈ ఆంక్షల బిల్లులో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై విధించే సుంకాలను 500 % నుంచి 100 శాతానికి తగ్గించారు. రష్యా నుంచి అత్యధికంగా ముడిచమురు కొనుగోలు చేస్తున్న చైనా, ఇండియా, స్లోవేకియా, హంగేరి, అజర్బైజాన్ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ బిల్లును తీసుకొచ్చారు. దివంగత సెనెటర్ లిండ్సే గ్రాహమ్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు ఇప్పుడు అధికార, ప్రతిపక్ష సభ్యుల నుంచి మద్దతు లభించింది.

ఈ బిల్లు అమల్లోకి వస్తే రష్యా నుంచి ముడిచమురు కొంటున్న ఐదు దేశాలతో పాటు, 15శాతం లేదా అంతకంటే తక్కువ సహజవాయువు కొంటున్న బెల్జియం, జపాన్, ఫ్రాన్స్, చైనా, హంగేరి లాంటి దేశాలకూ ఊరట లభించనుంది. రష్యా నుంచి ఇండియాతో పాటు చైనా లాంటి దేశాలు ముడిచమురును కొనుగోలు చేస్తే ఆ దేశం ఆర్థికంగా బలపడి ఉక్రెయిన్పై యుద్ధం కొనసాగిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. అందులో భాగంగానే గతంలో 500 శాతం సుంకాలు విధించాలని తీసుకొచ్చిన ఈ బిల్లును, అమెరికా జాతీయ ప్రయోజనాల కోసం 100 శాతానికి తగ్గించింది. ఈ భారీ సుంకాల వల్ల రష్యా నుంచి భారత్, చైనా లాంటి దేశాలు ముడి చమురు దిగుమతులను తగ్గించాలన్నదే తమ లక్ష్యం అని అమెరికా చెబుతోంది.





























