Skip to main content

Namaste NRI

లాటిన్ అమెరికాకు పాకిన ఒమిక్రాన్

కరోనా సరికొత్త వేరియండ్‌ ఒమిక్రాన్‌ ప్రపంచ దేశాలను వణికిస్తున్నది. తాజాగా లాటిన్‌ అమెరికాకు కూడా ఈ వైరస్‌ వ్యాప్తి చెందింది. తొలిసారిగా బ్రెజిల్‌లో రెండు కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్‌ 23న దక్షిణాఫ్రికాలోని సావో పౌలో నుంచి వచ్చిన భార్యాభర్తలిద్దరికి పాజిటివ్‌ వచ్చిందని తెలిపింది. పరీక్షల్లో వారికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ అని తేలిందని వెల్లడిరచింది. వారి నమూనాలను మరో పరీక్షించడానికి ల్యాబ్‌కు పంపించామని తెలిపింది. ఇప్పటికే పలు దేశాల్లో ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో అంతర్జాతీయ ప్రయాణికులపై నిషేదాలు విధిస్తూన్నాయి.

Social Share Spread Message

Latest News