Skip to main content

Namaste NRI

అమెరికాలో తొలి కేసు… బహిరంగ ప్రదేశాల్లో మాస్కు

అమెరికాలో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదయింది. గత నెల 22న దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్‌ వచ్చిందని, అతనిలో స్వల్ప లక్షణాలు ఉన్నాయని వైట్‌ హౌజ్‌ ప్రకటించింది. ఆ వ్యక్తి నవంబర్‌ 22 దక్షిణాఫ్రికా నుంచి కాలిఫోర్నియాకు వచ్చాడని, అదే నెల 29న అతనికి పాజిటివ్‌ వచ్చిందని అధికారులు తెలిపారు. అతని సంబంధీకులను పరీక్షించామని, వారికి నెగెటివ్‌ వచ్చిందని ప్రకటించారు. అతడు కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నాడని వెల్లడిరచారు.  అమెరికా పౌరులంతా త్వరగా పూర్తిస్థాయిలో కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవాలని, వీలైనవాళ్లు బూస్టర్‌ డోసు తీసుకోవాలని చీఫ్‌ మెడికల్‌ అడ్వైజర్‌ ఆంథోనీ ఫౌసీ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.

Social Share Spread Message

Latest News