Skip to main content

Namaste NRI

ఆ దిగ్గజ కంపెనీలో లక్ష ఉద్యోగాలు అవుట్!

జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌ భారీగా ఉద్యోగ కోతలకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా లక్ష ఉద్యోగాలను తొలగించేందుకు నిర్ణయించినట్లుగా ప్రకటించింది. ఈ దశాబ్దం చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి కానుందని వెల్లడించారు. ఈ మేరకు కంపెనీ యాజమాన్యం, కార్మిక సంఘాలు ఒక అంగీకారానికి వచ్చాయని పేర్కొంది. ఇందులో ఇప్పటికే 50 వేల ఉద్యోగాల కోతకు అంగీకరించగా.. తాజాగా మరో 50 వేల పోస్టులను తొలగించేందుకు ఆమోదం తెలిపినట్లు చెప్పింది. కాగా, కంపెనీ చరిత్రలోనే కాకుండా ప్రపంచ ఆటోమొబైల్‌ రంగంలోనే ఇది అతిపెద్ద పునర్వ్యవస్థీకరణగా నిలవనుంది.

ప్రస్తుతం ఫోక్స్‌వ్యాగన్ కంపెనీలో దాదాపు 6.67 లక్షల మంది పనిచేస్తున్నారు. ఒక్క జర్మనీలోని దాదాపు 43 శాతం మంది విధులు నిర్వహిస్తున్నారు. కాగా, ఆ కంపెనీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లక్ష ఉద్యోగాలను తగ్గిస్తామని ప్రకటించింది. అంటే మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 15 శాతానికి సమానం అన్నమాట. ఈ ఉద్యోగాల కోతను కార్మిక సంఘాలు వ్యతిరేకించినట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజా ప్రకటనలో మాత్రం కార్మిక సంఘాలు కూడా అంగీకరించినట్లు తెలపడం గమనార్హం.

Social Share Spread Message

Latest News