Skip to main content

Namaste NRI

ఫీల్ గుడ్ మూవీ నుంచి యూత్‌ఫుల్ మెలోడీ సాంగ్ రిలీజ్

సుచిత్‌, అదితి త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ఫీల్‌ గుడ్‌. దయానంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విశ్వరూప ఫిల్మ్స్‌ పతాకంపై సుచిత్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవల మమ్మా మియా అనే గీతాన్ని విడుదల చేశారు. ప్రేమలోని సరదాలు, ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తూ ఈ పాటను రూపొందించారు.

నేటి యువత మెచ్చే రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇదని, త్వరలో విడుదల చేస్తామని మేకర్స్‌ తెలిపారు. రావూరి ప్రియాంక, లిఖిత్‌, రణధీర్‌ వాసుదేవ్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శాండిల్య పిసపాటి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దయానంద్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events