Skip to main content

Namaste NRI

బ్రిట‌న్‌లో ఇద్ద‌రు భార‌త సంత‌తి వ్య‌క్తుల‌కు .. జైలుశిక్ష‌

బ్రిట‌న్‌లో కారు రేస్‌లో పాల్గొని త‌ల్లీకూతుళ్ల మృతికి కార‌ణ‌మైన ఇద్ద‌రు భార‌తీయ సంత‌తి వ్య‌క్తుల‌కు జైలుశిక్ష ప‌డింది. ఆ ఇద్ద‌రికీ క‌లిపి 28 ఏళ్ల జైలుశిక్ష విధించారు. 2023 జ‌న‌వ‌రిలో రోడ్డు ప్ర‌మాద ఘ‌ట‌న జ‌రిగింది. ఈ కేసులో జాస్‌క‌మ‌ల్ రియాత్‌, హ‌ర్దీప్ బాచూకు జైలుశిక్ష ప‌డింది. రియాత్ వ‌య‌సు 37 ఏళ్లు, హ‌ర్దీప్ 29 ఉన్నాడు. బాచూకు చెందిన ఆడీ టీటీ ఆర్ఎస్ కారు ఢీకొన‌డంతో స్కూల్‌కు వెళ్తున్న త‌ల్లీకూతుళ్లు మృతిచెందారు. బాచూతో క‌లిసి రియాత్ కారు రేసులో పాల్గొన్న‌ట్లు సీసీటీవీ ఫూటేజ్ ద్వారా తెలిసింది. రియాత్ బీఎండ‌బ్ల్యూ ఎం135ఐ కారులో రేస్ చేశాడు.

నేరాన్ని అంగీక‌రించిన బాచూకు 12 ఏళ్ల జైలుశిక్ష ప‌డింది. కానీ త‌న త‌ప్పు లేద‌ని వాదించిన రియాత్‌కు 16 ఏళ్ల జైలుశిక్ష విధించారు. ఇద్ద‌రికీ ఆరేళ్ల పాటు డ్రైవింగ్ నిషేధించారు. రోడ్డు అనేది రేస్ ట్రాక్ కాదు అని, ప్ర‌జా ర‌వాణా రోడ్డుపై శ‌క్తివంత‌మైన కార్ల‌ను ప‌రీక్షించ‌డం స‌రికాదు అని జ‌డ్జీ రే సింగ్ త‌న తీర్పు స‌మ‌యంలో పేర్కొన్నారు. పోటీప‌డి అతివేగంగా వాహ‌నాన్ని న‌డ‌ప‌డం వ‌ల్ల ప్రాణ నష్టం జ‌రిగిన‌ట్లు జ‌డ్జీ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events