వేగంగా వ్యాప్తిస్తూ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ డేంజర్ బెల్స్ మోగించింది. అమెరికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా మొదటి మరణం నమోదైంది. టెక్సాస్లోని హారిస్ కౌంటీలో ఓ వ్యక్తి మరణించినట్లు కౌంటీ ఆరోగ్యశాఖ పేర్కొంది. అంయితే, సదరు వ్యక్తి ఇప్పటి వరకు టీకా తీసుకోలేదని, అతని వయసు 50 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని తెలిసింది. ఇంతకు అతడు రెండు సార్లు కొవిడ్ బారినపడ్డట్లు అధికారులు పేర్కొనన్నారు. కౌంటీ మెజిస్ట్రేట్ లీనా హిడ్గాలో కరోనా కొత్త వేరియంట్ కారణంగా ఒకరు మృతి చెందారని, ఇదే ఒమిక్రాన్ కారణంగా నమోదైన తొలి మరణమని పేర్కొన్నారు. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ అమెరికాలో విజృంభిస్తున్నది. ఈ నెల 18తో పూర్తయిన వీక్లీ సీక్వెన్సింగ్ డేటా ఆధారంగా అమెరికాలో కరోనా కేసుల్లో 73 శాతం ఒమిక్రాన్ వేరియంట్ కారణమని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పేర్కొంది.














