అమెరికా త్వరలోనే స్టార్టప్ వీసాను ప్రవేశపెట్టనున్నది. ప్రపంచ నలుమూలల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించేందుకు, వారి సృజనాత్మకతకు ద్వారాలు తెరిచేందుకు అమెరికా కంపీట్స్ యాక్ట్‌లో భాగంగా ఈ వీసాను తెస్తున్నారు. ఈ చట్టాన్ని అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. అమెరికాలో స్టార్టప్‌లు స్థాపించేవారికి డబ్ల్యూ `1, వారు తెచ్చుకున్న ఉద్యోగులకు డబ్ల్యూ`2 అనే వీసాలు ఇస్తారు. స్థాపించే కంపెనీని బట్టి ఉద్యోగులను ఎంతమందినైనా తెచ్చుకోవచ్చని అంటున్నారు. అయితే వారు అమెరికాలోని పరిశోధనా సంస్థల్లో ఏదైనా దేశంలోని తత్సమానమైన సంస్థలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్‌లో డాక్టోరల్ డిగ్రీ చేసి ఉండాలని తెలిపింది.














