బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మకమైన అవార్డుతో సౌదీ ప్రభుత్వం ఆయనను గౌరవించింది. సౌదీ అరేబియా జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ తాజాగా జాయ్ అవార్డ్స్ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగానే సల్మాన్ ఖాన్‌కు పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రదానం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. అవార్డు అందుకుంటున్న ఫొటోను షేర్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా పలువురు నటీనటులకు అవార్డులతో సత్కరించింది.














